17 April, 2026 | 1:01 AM

దోస్త్ మూడోఫేజ్ గడువు పొడిగింపు

20-06-2025 01:08 AM

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ గడువు పొడిగించారు. ఈనెల 25 వరకు అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన రివైజ్‌డ్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది.

మూడో విడత సీట్లను ఈనెల 28న కేటాయించనున్నారు. ఫేజ్1, 2లలో  సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో 26 నుంచి 30 వరకు ఖరారు చేసుకోవాలని, మూడో విడతలో సీట్లు పొందేవారు జూన్ 28 నుంచి 30వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. జూన్ 30 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభంకానున్నాయి.