3 August, 2026 | 3:28 PM

డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలి

22-06-2024 12:10 AM
  • ఎమ్మెల్యే, అధికారులు మమ్మల్ని మోసం చేశారు బల్దియాలో డబుల్ బెడ్రూం బాధితుల నిరసన 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి) : డబుల్ బెడ్రూం ఇళ్లను స్థానికులకే కేటాయిస్తామని చెప్పిన ఎమ్మెల్యే రాజాసింగ్, అధికారులు తమను మోసం చేశారంటూ దూల్‌పేట ప్రాంతానికి చెందిన బాధితులు వాపోయారు. గోషామహాల్ నియోజకవర్గం దూల్‌పేటలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన 145 డబుల్ బెడ్రూం ఇళ్లు స్థానికులకే కేటాయిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట మార్చడాన్ని వ్యతిరేకిస్తూ జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.

అసోసియేషన్ నాయకులు నర్సింగ్ రావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 1472 మంది లబ్దిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసిన అధికారులు.. 1227 మందికి కొల్లూరులో ఇళ్లను కేటాయించగా, మిగతా 145 మందికి స్థానిక దూల్‌పేటలోనే ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ, ఆ సమయంలో ఎన్నికలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయిం దన్నారు. ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్‌ను, అధికారులను కలిస్తే మాట మారుస్తున్నారని, ఎమ్మెల్యే రాజాసింగ్ తమ వర్గానికి చెందిన వారికి వాటిని కేటాయించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఈ విషయంపై ప్రజావాణిలో సీఎం రేవంత్‌రెడ్డికి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి, జీహెచ్‌ఎంసీ అధి కారులకు వినతిపత్రాలు అందించినా స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణ మే స్పందించి మా ఇళ్లను మాకే ఇప్పించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో కళ్యాణి, ప్రతిభ, కమల, మంజుల తదితరులు బస్తీ నాయకులు పాల్గొన్నారు.