6 May, 2026 | 11:26 AM

డబుల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలి

06-02-2025 12:27 AM

గద్వాల, ఫిబ్రవరి 5 ( విజయక్రాంతి ) : లాటరీ పద్ధతిలో ఎంపికైన ప్రతి లబ్ధిదారునికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల జిల్లా కేంద్రంలోని సంఘాల చెరువు వద్ద 1,275 , గోన్ పాడు గ్రామం దగ్గర 25 ఇళ్ళను ఇల్లు లేని పేదల కోసం, ఇళ్ల స్థలాలు కోల్పోయిన పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం  నిర్మించింద న్నారు.  లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి సంవత్సరం పూర్తయిన ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శిం చారు.

ఈ కార్యక్రమంలో  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ రెండు పడక గదుల లబ్ధిదారులు రాముడు, షేక్ సాదిక్, గంజిపేట ఆంజనేయులు, లక్ష్మి, జమున,  అబ్దులమ్మ, నాగరాజు, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.