6 May, 2026 | 11:53 AM

రోడ్డెక్కిన రైతన్న

06-05-2026 11:18 AM

మిల్లర్ల తీరుపై తిమ్మాయిపల్లి రైతుల ధర్నా

నంగునూరు,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా(Siddipet District) నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామ రైతులు బుధవారం రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగారు. వడ్ల లో తాలు ఉందనే సాకుతో మిల్లర్లు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ముండ్రాయి వద్ద సిద్దిపేట - హన్మకొండ ప్రధాన రహదారిపై బైఠాయించారు.

ధాన్యం సేకరణలో జాప్యం చేస్తూ అధికారులు, మిల్లర్లు తమను నానా అవస్థలు పెడుతున్నారని రైతులు మండిపడ్డారు. ఈ ఆందోళన కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.ఘటనా స్థలానికి చేరుకున్న రాజగోపాల్‌పేట ఎస్ఐ టి. వివేక్ ఉన్నతాధికారులతో మాట్లాడి, సమస్యను   పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.