6 May, 2026 | 11:52 AM

పెద్ద గోప్లాపూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం

06-05-2026 11:21 AM

లారీ, డీసీఎం, బస్సు ఢీకొని వ్యక్తి మృతి పలువురికి గాయాలు 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి

దేవరకద్ర: లారీ, డీసీఎం, బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన దేవరకద్ర మున్సిపాలిటీ(Devarakadra Municipality) పరిధిలోని పెద్ద గొప్లాపూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. దేవరకద్ర ఎస్ఐ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం పెద్దగోప్లాపూర్ గ్రామ సమీపంలో ఉన్నా మూలమలుపు దగ్గర రాయిచూర్- హైదరాబాద్ అంత ర్ రాష్ట్ర రహదారి పై  ఉన్న స్పీడ్ బ్రేకర్ల  దగ్గర   హైదరాబాద్ నుండి సిందనూర్ కు ట్రాన్స్పోర్ట్ లోడుతో  వెళ్తున్న డీసీఎంను రాయి చూరు వైపు వెళ్తున్న లారీ డీసీఎంను అతివేగంగా వెనుక నుంచి ఢీ కొనడంతో రైయిచూర్ నుండి హైదరాబాద్ కు వస్తున్న పెళ్లి బస్సు ను ఎదురుగా ఢీకొంది.

దీనితో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ డీసీఎం డ్రైవర్ కు గాయాలయాయి. లారీ డీసీఎం వాహనాలు రోడ్డుపై బోల్తాపడ్డాయి లారీ డ్రైవర్ తీవ్ర గాయాలతో  లారీలో ఇరుక్కుపోయాడు. వెంటనే స్పందించిన దేవరకద్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లారీలో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్ను బయటకు తీసి చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో  జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతూ  లారీ డ్రైవర్ మృతి చెందాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకద్ర   ఎస్సై నాగన్న తెలిపారు. 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి

అదే సమయం లో మక్తల్ కి వెళ్తున్న పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) సంఘటన స్థలాన్ని పరిశీలించి  రోడ్డు ప్రమాదాలు జరగకుండా సిగ్నల్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.