5 August, 2026 | 1:54 AM

అర్హులైన వారికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలి

05-08-2026 12:00 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీల్ రావు 

ముకరంపుర, ఆగస్టు 4 (విజయ క్రాంతి)కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధి చింతకుంట లో గత పది ఏళ్లు గా నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వాస్తవ పరిస్థితిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు సమీ క్షించారు.ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ఇండ్ల సముదాయాల వద్ద రో డ్లు, డ్రైనేజీ, లైటింగ్, త్రాగునీరు, లిఫ్టులు, విద్యుత్ కనెక్షన్లు వంటి అన్ని మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించిన తర్వాత మాత్రమే అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాల న్నారు.

గతంలో తాను నగరపాలక సంస్థలో మేయర్ గా ఉన్నప్పుడు అప్పటి కలెక్టర్ ఆలోచన మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతుల కోసం రూ. 4 కోట్ల రూపాయల నిధులు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయించినట్లు తెలిపారు.ఈ డబుల్ బెడ్ రూమ్స్ పనులను పూర్తి చేయడానికి మౌలిక వసతుల సదుపాయాల కోసం 20 నుంచి 25 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఇందులో ఒక్కో బ్లాక్ లో 84 అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉండగా, ప్రతి బ్లాక్ కు రెండు లిఫ్టు ల ప్రొవిజన్ ఉన్నప్పటికీ ఒక్క లిఫ్టు ను మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసిందని అయితే ఆరు అంతస్తుల భవనాల్లో నివసించే వారికి ఒక్క లిఫ్ట్ ఏమాత్రం సరిపోదన్నారు.

తప్పనిసరిగా ప్రతి బ్లాక్కు రెండు లిఫ్టులు ఏర్పాటు చేయాలని అలాగే వాటి నిర్వహణ కోసం ప్రభుత్వం లేదా నగరపాలక సంస్థ ఒక ’కార్పస్ ఫండ్’ ఏర్పాటు చేసి, రాబోయే 5 సంవత్సరాల పాటు లిఫ్ట్ మరియు ఇతర నిర్వహణ బాధ్యతలు చూడటానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు.అంతేకాకుండా హైదరాబాద్ లో పేదల కోసం ’క్యూర్’ పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తామన్న ఆలోచన తరహాలోనే, ఇక్కడ కూడా అమలు చేయాలని, అర్హులైన వారందరికీ ఈ సంవత్సరంలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.