4 July, 2026 | 10:03 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

రెవెన్యూలో డబుల్ రికార్డులు

13-06-2025 02:07 AM
  1. ప్రభుత్వాలు మారినప్పుడల్లా జరిగే తంతు
  2. అధికారులు, బడా నాయకుల చేతివాటంతోనే మార్పులు
  3. అవసరానికి తగ్గట్టుగా రికార్డుల వినియోగం
  4. సిబ్బందిని గుప్పెట్లో పెట్టుకుంటున్న మధ్యవర్తులు 
  5. భూభారతిలో ఏ రికార్డులు నమోదు చేస్తారు?

గజ్వేల్, జూన్12: దశాబ్దాలుగా రెవిన్యూ శాఖలో అవినీతి జరుగుతూనే ఉంది. ఒకవై పు రాజకీయ నాయకులు, మరోవైపు రెవె న్యూ అధికారులు అక్రమార్కులతో లాలూ చీ పడి నిజమైన భూ యజమానులను, చి న్న రైతులను ఇబ్బందులు పెడుతున్న సమస్యలు నిత్యం వినబడుతూనే ఉన్నాయి. 

రికా ర్డులు తప్పులతడకలుగా ఉన్నాయంటూ రై తులకు భూ సమస్యలు లేకుండా చేస్తామని చెప్పి గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు మరింత కష్టాలు అనుభవించడంతోపాటు కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. పహా ని రికార్డులను గత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అవసరానికి ఇష్టారీతిగా  మార్చిన ఘనత నాయకులది అధికారులదే అని ఒప్పుకోక తప్పదు.

రికార్డులు మార్చి రై తులను కబ్జాల పేరుతో ఇబ్బందులు పెట్టి, భయబ్రాంతులకు గురిచేసి సెటిల్మెంట్ పేరు తో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయడం నాటినుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. రాతపూర్వకంగా ఉన్న పహాని రికార్డులను సైతం పలు కారణాలు చెబుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి లో నమోదు చేయకుండా రైతులను ముప్పు తిప్పలు పెట్టారు.

ధరణి కన్నా ముందు రెవె న్యూ రికార్డులు సవరణ చేసుకోవడానికి వం దలు, వేల రూపాయలు ఖర్చుపెట్టిన రైతు లు ధరణి వచ్చిన తర్వాత లక్షల రూపాయ లు అధికారులు, నాయకులకు సమర్పించుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అధికా రులు రైతుల సమస్యలను పరిష్కరించినందుకు మామూలు కింద భూములను తీసు కున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

రెవె న్యూ రికార్డులలో అవకతవకలు అధికారులు బడా నాయకుల చేతివాటంతోనే జరుగుతాయని ప్రజలందరికీ తెలిసినా ఏమి చేయలేక పోతున్నారు. అధికారులు, నాయకుల మధ్య నే కాకుండా రైతుల సమస్యలు పరిష్కరిస్తామంటూ తిరిగే మధ్యవర్తులు రెవిన్యూ సి బ్బందిని మామూళ్ల మత్తులో ముంచి గుప్పి ట్లో పెట్టుకుంటున్నారు.

జిల్లాలోని చాలా గ్రా మాలకు చెందిన డబుల్ రికార్డులను ( నకిలీ పహానీలు) తహసిల్దార్ కార్యాలయాలలో కొ నసాగిస్తున్నట్లు పలువురు ఆరోపణలు వ్య క్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో అప్పటి వీఆర్వోలు, నాయకులు, మధ్యవర్తులు డబు ల్ రికార్డులను తమ అవసరాలకు తగినట్లు గా అధికారుల గుర్తింపుతో తీసుకొని బయ ట పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.

ధరణి ద్వారా రైతులు ఇ బ్బందులు ఎదుర్కొన్నారని, భూభారతి చ ట్టం ద్వారా రైతులకు పూర్తి న్యాయం చేస్తామ న్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ రికార్డులను పరిశీలిస్తుందా? ఉన్న రికార్డులను యధావిధిగా భూభారతిలోనూ కొన సాగిస్తుందా అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

అధికారులు, నాయకులు, మధ్యవర్తుల మామూళ్ల వసూళ్లకు ఇకనైనా భూభారతి చట్టం ద్వారా ముగింపు పలుకుతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు . ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోరుందో వేచి చూడాలి మరి.