calender_icon.png 13 November, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్ 1నుంచి డీపీఎస్ ఫస్టియర్ పరీక్షలు

13-11-2025 12:05:14 AM

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): డిసెంబర్ 1నుంచి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. 2024-26 బ్యాచ్ విద్యార్థులకు డిసెంబర్ 1 నుంచి 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష సమయం ఉదయం 9. నుంచి మధ్యా హ్నం 12 గం. వరకు జరగనున్నాయి. ఇదిలా ఉంటే .. విద్యార్థులకు పార్ట్-2 పుస్తకాలను పంపిణీ చేశారు. పార్ట్-2 పుస్తకాలను  బుధవారం పలు జిల్లాల్లో పంపిణీ చేశారు.