calender_icon.png 8 February, 2026 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ త్రైమాసిక ఫలితాలు విడుదల

07-02-2026 11:07:29 PM

ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల్లో 272 సెంటర్ల భారీ నెట్‌వర్క్‌తో  భారతదేశపు అతి పెద్ద కంటి సంరక్షణ సేవల చెయిన్ గా కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ 2025 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికం మరియు తొమ్మిది నెలల వ్యవధికి గాను కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అన్-ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2025 డిసెంబర్ 31 నాటికి నెట్‌వర్క్ సెంటర్ల సంఖ్య 272కి చేరింది. త్రైమాసికంలో కొత్తగా 14 సెంటర్లు జతయ్యాయి. వీటిలో 9 సెకండరీ, 5 ప్రైమరీ సెంటర్లు ఉన్నాయి. 11.2% వృద్ధితో 81,002 సర్జరీలు నిర్వహించబడ్డాయి. అలాగే 21.9% వృద్ధితో మొత్తం ఆదాయం రూ. 540 కోట్లకు చేరింది. 

23.0% వృద్ధితో కార్యకలాపాల నుంచి ఆదాయం రూ. 530 కోట్లకు చేరుకుంది. 2025 డిసెంబర్ 31 నాటికి నెట్‌వర్క్ సెంటర్ల సంఖ్య 272కి చేరింది. తొమ్మిది నెలల వ్యవధిలో కొత్తగా 38 సెంటర్లు జతయ్యాయి. వీటిలో 1 టర్షరీ, 22 సెకండరీ, 15 ప్రైమరీ సెంటర్లు ఉన్నాయి. 11.6% వృద్ధితో 9M’FY2026లో 2,38,283 సర్జరీలు నిర్వహించబడ్డాయి. 20.8% వృద్ధితో మొత్తం ఆదాయం రూ. 1,548 కోట్లకు చేరింది. 21.2% వృద్ధితో కార్యకలాపాల నుంచి ఆదాయం రూ. 1,516 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయంలో సర్వీసుల విక్రయం వాటా 78.5%గా మరియు ఉత్పత్తుల విక్రయం వాటా 21.5%గా నమోదైంది.

ఆదాయాలు మరియు లాభదాయకత మెరుగ్గా వృద్ధి చెందడంతో Q3 FY26లో కంపెనీ పటిష్టమైన పనితీరు కనపర్చిందనీ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ సీఈవో డాక్టర్ అదిల్ అగర్వాల్  తెలిపారు. నిర్వహణ మోడల్ పటిష్టత, వ్యయాలను క్రమశిక్షణతో నియంత్రించుకోవడం దీనికి దోహదపడ్డాయని వెల్లడించారు. 

కొత్త కేంద్రాల విస్తరణ, ప్రస్తుత మార్కెట్లలో కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు ఎంపిక చేసుకున్న కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం ద్వారా వేగవంతమైన వృద్ధి సాధించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతోందని తెలిపారు. బ్రాండ్ బలం మరియు విస్తరణ సామర్థ్యాల దన్నుతో డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ సంస్థ పేషంట్ల భద్రత మరియు క్లినికల్ నాణ్యతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూనే సుస్థిర అభివృద్ధి సాధించడాన్ని కొనసాగిస్తుందన్నారు.