calender_icon.png 29 June, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ దత్తాత్రేయుడు

29-06-2025 02:24:45 AM

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గా ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వు లు జారీ చేసింది.

తక్కువ ఖర్చుతో క్యాన్సర్ వ్యాధి నివారణ, చికిత్సకు డాక్టర్ నోరి సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయనున్నా రు. రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ఈ నియ మాకం ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.