26 April, 2026 | 2:41 AM

డిప్యూటేషన్ రద్దు

29-06-2025 02:23 AM

వలిగొండ, జూన్ 28 (విజయక్రాంతి): వర్కట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆయుర్వేద డాక్టర్, ఫార్మసిస్టు అటెండర్ డిప్యుటేషన్‌పై భువనగిరి పరిధిలోని బొల్లెపల్లికి వెళ్లారు. దీంతో వర్కట్‌పల్లి ఆరోగ్యకేంద్రంలో సిబ్బంది కొరత ఏర్పడగా ఈ విషయమై ఈ నెల 26న విజయక్రాంతి కథనాన్ని ప్రచురించింది. వార్తకు జిల్లా వైద్యాధికారులు స్పందించి డిప్యూటేషన్‌ను రద్దు చేశారు.