రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా డాక్టర్ కే లక్ష్మణ్
- రాజ్యసభ సెక్రటేరియేట్ జాయింట్ సెక్రటరీ ఉత్తర్వులు
- రాజ్యసభ చైర్మన్, బీజేపీ నాయకత్వానికి లక్ష్మణ్ కృతజ్ఞతలు
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ నియమితులయ్యా రు. రాజ్యసభ సభ్యుల వసతి, సౌకర్యాల కమిటీకి చైర్మన్‌గా లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను రాజ్యసభ సెక్రటేరియేట్ జాయింట్ సెక్రటరీ ఏకే మల్లిక్ సోమవారం జారీచేశారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశమిచ్చిన రాజ్యసభ చైర్మన్, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
లక్ష్మణ్ ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 1980లో బీజేపీలో చేరిన లక్ష్మణ్.. 1995 99 బీజేపీ హైదరాబాద్‌శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయా రు. 1999లో ముషీరాబాద్ నుంచి గెలి చారు. 2004, 2009లో ఓడారు. 2014లో ముషీరాబాద్ నుంచి గెలిచారు . 2016లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.






