2 June, 2026 | 7:42 PM

Breaking News

వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఎమ్మెల్యేను అవమానపరచలేదు   •   కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్   •   బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు   •   సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం   •   సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్   •   బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •  

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ

02-06-2026 06:35 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): సనత్ నగర్ నియోజకవర్గంలోని సనత్ నగర్, బీకే గూడ, SR నగర్ డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రజలంతా కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం 12ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ కల సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్, సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల దశాబ్దాలు ఆకాంక్షను గౌరవిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. 60 ఏండ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన మహా నాయకురాలు సోనియా గాంధీ అంటూ అభివర్ణించారు. తెలంగాణ ఆవిర్భావం కేవలం పరిపాలనా విభజన మాత్రమే కాకుండా, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. అనంతరం తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థికవృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. మరోవైపు బీకే గూడ డివిజన్ లో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.