24 April, 2026 | 7:22 PM

నవ దంపతులను ఆశీర్వదించిన డాక్టర్ మట్టా దయానంద్

24-04-2026 05:36 PM

తల్లాడ,(విజయక్రాంతి): తల్లాడ మండలం పాత మిట్టపల్లి గ్రామంలో దంతాల సత్యం నిర్మల దంపతుల కుమారుడు వంశీకృష్ణ వెడ్స్ నాగమల్లేశ్వరి వివాహ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్  హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి దీవించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరియు అదే గ్రామానికి చెందిన షేక్ మీర్జా పాషా నజీమా దంపతుల నూతన ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్  పరిశీలించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాత మిట్టపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.