రజక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ మొలుగూరి నాగరాజుకు ఘనసన్మానం
చిలుకూరు: చిలుకూరు మండలం చెన్నారిగూడెం గ్రామానికి చెందిన ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ములుగూరి నాగరాజు(Alochana Foundation Chairman Dr. Muluguri Nagaraju)కు, ఇటీవల కాలంలో అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన సందర్భంగా నాగరాజును ఆ గ్రామవాసులు మంగళవారం ఘనంగా సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా సీఐ, మొగిలిచర్ల రవి, ఏవిఆర్ వారి, ఎంపీఎస్ స్కూల్ మాజీ కరస్పాండెంట్ దుస్స సత్యనారాయణ, చింతారెడ్డి లక్ష్మారెడ్డి, కొనకంచి వీరయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సన్మాన గ్రహీత నాగరాజు మాట్లాడుతూ... భవిష్యత్తులో కూడా గ్రామ రజక సంఘం వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గతంలో చెప్పిన విధంగా ఐలమ్మ ప్రతి వర్ధంతి, జయంతికి, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, రజక సంఘానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరు రజక సంఘం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.




