7 April, 2026 | 3:07 AM

వణతి శ్రీనివాసన్ నామినేషన్‌కు హాజరైన డాక్టర్ పద్మ వీరపనేని

07-04-2026 12:46 AM

జూబ్ల్లీహిల్స్, ఏప్రిల్ 6(విజయక్రాంతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకున్న వేళ బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వణతి శ్రీనివాసన్ ఉత్తర కోయంబత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు, తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఇన్-ఛార్జ్ డాక్టర్ పద్మ వీరపనేని పాల్గొని మద్దతు తెలియజేశారు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి సందడి చేయగా, మహిళా నేతల రాకతో నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం మరింత ఉత్సాహంగా మారిం ది. వణతి శ్రీనివాసన్ గెలుపు కోసం మహిళా మోర్చా శ్రేణులు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా కృషి చేస్తున్నాయని పద్మ వీరపనేని తెలిపారు.