7 April, 2026 | 3:06 AM

ప్రేరణ అంతర కళాశాలల కామర్స్ ఫెస్ట్

07-04-2026 12:46 AM

ఐఐఎంసీ కళాశాలలో కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ

ఖైరతాబాద్, ఏప్రిల్ 6(విజయక్రాంతి): ఐఐఎంసీ కళాశాలలో తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ప్రేరణ’ అంతర కళాశాలల కామర్స్ ఫెస్ట్‌ను సోమవారం నిర్వహించారు. ఈ ఫెస్ట్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పలు కామర్స్ కళాశాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథి తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ చెన్నప్ప మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాణిజ్య శాస్త్రానికి సంబంధించిన అధ్యాపకులు అందరూ కలిసి తెలంగాణ కామర్స్ అసోసియేషన్‌గా ఏర్పడి వాణిజ్య శాస్త్రానికి సంబంధించిన ఎన్నో అంశాలపై వర్క్ షాపులు, సె మినార్లు, చర్చలు ఫలవంతంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉ న్న కామర్స్ కళాశాలలోని దాదాపు 16 వేల మంది కామర్స్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో సహ పాఠ్య కార్యక్రమాల ద్వారా వాణిజ్య శాస్త్ర అంశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2003లో ‘ప్రేరణ’ పేరు తో కామర్స్ ఫెస్ట్‌ను ప్రారంభించామని అన్నారు.

అప్పటినుంచి ప్రతి సంవత్సరం నిర్వహించి విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను, ప్రశంసా పత్రాలను అందజేస్తున్నామన్నారు. గౌరవ అతిథిగా ఐపీఈ ప్రొఫెసర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో అంతర్గతంగా ఉన్న నైపుణ్యాలను బహిర్గత పరిచి వారిలో, వాణిజ్య శాస్త్ర అంశాలపై అవగాహనను పెంపొందించడమే కాకుండా మానసిక స్థుర్యైన్ని కలగజేసేలా చేస్తాయని తెలియజేశారు.నేటి పోటీ ప్రపంచంలో ముందుండాలంటే విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధితో ముందుకు వెళ్లాలని తెలియజేశారు.

ఈ సంవత్సరం ప్రేరణ కార్యక్రమా నికి ఆతిథ్యం వహిస్తున్న ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్ మాట్లాడుతూ తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ప్రతి సం వత్సరం వాణిజ్యశాస్త్ర విద్యార్థుల కోసం ఎన్నో ప్రేరణాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తుందనానరు. వీటిని విద్యార్థులు సద్విని యోగపర్చుకొని వారి ప్రతిభను బహిర్గత పర్చుకోవాలని తెలియజేస్తూ ప్రేరణ కార్యక్రమాల ద్వారా దాదాపు 25వేల నగదు ప్రోత్సాహకాలను విద్యార్థులకు అందజేస్తున్నామని తెలియజేశారు. దీనిలో భాగంగా మొత్తం వాణిజ్య శాస్త్రానికి సంబంధించిన తొమ్మిది ఈవెంట్లను నిర్వహించామన్నారు.

ప్రతి విభాగం నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచినరెండు టీంలను మంగళవారం అవినాష్ కళాశాలలో జరిగే అంతర విశ్వవిద్యాలయాల ప్రేరణ పోటీకి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రఘువీర్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సికింద్రాబాద్ పీజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ రామేశ్వర్, ఐఐఎంసీ కళాశాల డీన్లు డాక్టర్ డి. తిరుమలరావు, డాక్టర్ సం తోషి,  వివిధ విభాగాల అధ్యక్షులు, అధ్యాపకులు బోధనేతర సిబ్బంది, వివిధ కళాశాలకు చెందిన 150 మంది విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.