12 June, 2026 | 2:03 AM

డాక్టర్ రఘురామ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్

12-06-2026 12:58 AM

ఏఐ ఆధారిత హలోగ్రాఫిక్ లెక్చర్ ద్వారా సరికొత్త రికార్డు

హైదరాబాద్, 11 జూన్(విజయక్రాంతి): ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు చెం దిన డాక్టర్ పి. రఘురామ్, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వారు గురువారం సంయుక్తంగా ‘ఇంటరాక్టివ్ ఏఐ-ఎనే బుల్ హోలోగ్రాఫిక్ హెల్త్ అవేర్‌నెస్ లెక్చర్‌కు అతిపెద్ద ప్రేక్షకులను’ నిర్వహించినం దుకు గిన్నిస్ వరల్ రికార్డ్స్ టైటిల్‌ను సాధించారు. ఈ ఘనతతో డాక్టర్ రఘురామ్ 15 నెలల్లో మూడవ గిన్నిస్ వరల్ రికార్డ్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

ప్రజారోగ్య అవ గాహనను వినూత్న పద్ధతుల ద్వారా విస్తరించాలనే ఆయన నిరంతర కృషికి ఇది మరో మైలురాయి. ఈ కార్యక్రమంలో, డాక్టర్ ర ఘురామ్ ఏఐ సృష్టించిన హోలోగ్రాఫిక్ బోధకుడు 30 నిమిషాల పాటు రొమ్ము ఆరోగ్యంపై అవగాహన ఉపన్యాసం ఇచ్చా రు. దాని తర్వాత 30 నిమిషాల పాటు బహుభాషా ఇంటరాక్టివ్ ప్రశ్న- జవాబుల సెషన్ జరిగింది. కాగా ఏఐ-ఆధారిత హోలోగ్రాఫిక్ ఆరోగ్య విద్యలో ఆవిష్కరణను గుర్తిం చే కొత్తగా సృష్టించిన విభాగం కింద గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా నారి (నేషనల్ అవేర్‌నెస్ అండ్ రిసోర్స్ ఇనిషియేటివ్ ఫర్ బ్రెస్ట్ హెల్త్) కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో జా తీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజత్ శేఠ్, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కె పద్మనాభయ్య, ప్రముఖ కూచిపూ డి, భరతనాట్య నర్తకి, పద్మశ్రీ పురస్కార గ్రహీత, రొమ్ము క్యాన్సర్‌ను జయించిన డాక్ట ర్ ఆనంద శంకర్ జయంత్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ వైస్ ప్రెసిడెంట్ డా. సి. మల్లికార్జున తదితరు లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజాత్ శేఠ్ మాట్లాడుతూ డాక్టర్ రఘురామ్‌ను ఈ విశిష్ట గిన్నిస్ వరల్ రికార్డ్స్ ఘనతకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని తెలి పారు. డాక్టర్ పి. రఘురామ్ మాట్లాడుతూ ఈ గుర్తింపును నా తల్లి, ప్రముఖ స్త్రీరోగ నిపుణురాలు, రొమ్ము క్యాన్సర్‌ణు జయించిన డాక్టర్ ఉషాలక్ష్మికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.