calender_icon.png 9 December, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ వీఎన్‌వీకే శాస్త్రి కన్నుమూత

09-12-2025 12:59:07 AM

గిరిజనులపై లోతైన పరిశోధనలు 

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాం తి): దేశంలోనే అగ్రగణ్య సామాజిక మానవశాస్త్రవేత్తలలో ఒకరైన, గిరిజన సమాజాలపై అత్యంత లోతైన పరిశోధనలు చేసిన డాక్టర్ వీఎన్‌వీకే శాస్త్రి సోమవారం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గిరిజన సమాజాలపై ఐదు దశాబ్దాలకుపైగా పరిశోధన, సేవ, శిక్షణ, పరిరక్షణ చేసిన ఈ మేధావి మరణం లోటు తీరనిది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సామాజిక మానవ శాస్త్రంలో 1980లో పీహెచ్.డి పొందిన డా. శాస్త్రి 52 సంవత్సరాల పరిశోధన, పరిపాలన, శిక్షణ అను భవంతో భారతదేశంలోని గిరిజన అధ్యయన రంగానికి అతి విలువైన సేవలు అం దించారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో 10 పుస్తకాలు, 100కు పైగా వ్యాసా లు, పరిశోధన పత్రాలు ప్రచురించారు. 1970 లలో ప్రభుత్వ సేవలో చేరిన ఆయన 2005 లో గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థ, హైదరాబాద్ డైరెక్టర్గా రిటైర్ అయ్యే వర కు గిరిజన సంక్షేమ శాఖలో 34 సంవత్సరాలు కీలక బాధ్యతలు నిర్వహించారు.