25 August, 2026 | 3:34 PM

Breaking News

అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలి   •   పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి   •   ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడి గా గోవర్ధన్   •   ప్రకృతిని మనం నాశనం చేస్తే.... ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   ప్రకృతిని మనం నాశనం చేస్తేప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు   •   నషాముక్త్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి   •   పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటి   •   వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలి   •   మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •  

ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్న అతివేగం

17-06-2026 02:48 AM

వర్గల్ కమాన్ వద్ద కారు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

గజ్వేల్, జూన్ 16: గజ్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరారం గ్రామం వర్గల్ కమాన్ వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రూరల్ సీఐ  రవి రాజు తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ముందుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది.

దీంతో అదుపు తప్పిన ఆటో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కాయితి సత్తయ్య (42)ను ఢీకొట్టి ఆటో, కారు రెండూ పల్టీలు కొట్టాయి. ఈ ప్రమాదంలో కాయితి సత్తయ్యతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న కొరిమి లక్ష్మి (45) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ కొరిమి శ్రీనివాస్, అతని కుమార్తెతో పాటు కారులోని ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ కట్కూరి అశ్పో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.