వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ
16-05-2026 03:44 PM
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని సీతాయిపల్లి, మేడిపల్లి గ్రామాల వరి కొనుగోలు కేంద్రాలను డీఆర్‌డీఏ ఏపీడీ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరిలోని తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సూచించారు. తూకాన్ని త్వరితగతంగా చేపట్టాలని , తూకం వేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు త్వరితగతిన పంపాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం ప్రసన్న కుమార్, సీసీ లు రాములు, రమేష్, కాశీనాథ్ వివోఎ లు పుష్పలత, గౌస్ ఖాన్, ట్యాబ్ ఆపరేటర్ భూమన్న, రైతులు పాల్గొన్నారు.






