మంథనిలో పశు వైద్య కేంద్రానికి తాళం
అందుబాటులో లేని పశు వైద్యాధికారులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పశువుల యజమానులు
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని పశు వైద్య కేంద్రానికి శనివారం తాళం వేసి ఉంచడంతో పాటు అధికారులు అందుబాటులో ఉండటం లేదని పశు యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పశు వైద్యాధికారుల నిర్లక్ష్యానికి మండలంలోని యజమానులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ క్షేత్రంగా పేరొందిన మంథనిలో పశు వైద్యశాల నిర్లక్ష్యం మూలంగా పశువులకు వైద్యం లభించకపోవడం శోచనీయం. అధికారుల నిర్లక్ష్యానికి కార్యాలయానికి వేసిన తాళమే దర్పణం పడుతుంది. ఇప్పటికైనా పశు వైద్య అధికారులు స్పందించి పశువులకు సరైన వైద్యం అందించాలని రైతులు కోరుతున్నారు పశువుల యజమానులు కోరుతున్నారు. ఈ విషయంలో పై అధికారులు వెంటనే స్పందించి తమ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






