28 July, 2026 | 1:48 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

రూ.15 లక్షల ఎండు గంజాయి పట్టివేత

01-06-2026 02:02 AM

నారాయణఖేడ్, మే 31: రూ.15 లక్షల విలువ చేసే రెండు గంజాయిని పట్టుకోవడం జరిగిందని నారాయణఖేడ్ ఎక్సైజ్ సీఐ శంకర్, ఎస్త్స్రలు అనుదీప్ హనుమంతు ఆదివారం తెలిపారు. సిర్గాపూర్ మండల పరిధిలోని వాసర్ వద్ద ప్రధాన రహదారిపై శనివారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో షేరి తండాకు చెందిన చౌహన్ ప్రభు, మున్నా నాయక్ తండాకు చెందిన రాథోడ్ ప్రహల్లాద్ లు ద్విచక్ర  వాహనం పైన రూ.15 లక్షల విలువ చేసే 30కిలోల ఎండు గంజాయి తరలిస్తుండగా గుర్తించి పట్టుకోవడం జరిగిందన్నారు. వీరు బీదర్ నుండి నారాయణఖేడ్ కు గంజాయి తీసుకు వెళుతున్నారని పేర్కొన్నారు. వారిని అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనం, ఒక మొబైల్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. తనిఖీల్లో ఎక్సైజ్ సిబ్బంది రాజేష్, సాయి, శివకాంత్, శివకృష్ణ, పద్మ, కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.