24 April, 2026 | 1:48 AM

చలివేంద్రం ప్రారంభం

24-04-2026 12:00 AM

హనుమకొండ టౌన్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి):హనుమకొండ జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు చాహత్ బాజ్ పాయ్ ఆదేశాలమేరకు, హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మండుటెండల్లో ప్రజలకు తాగునీరు అందించాలనే ఉదాత్త లక్ష్యంతో, హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రెడ్ క్రాస్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు యన్.రవి ప్రారంభించారు.

అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండుటెండల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన ఈచలివేంద్రం సేవా దృక్పథానికి ప్రతిరూపం. నా పరిమితుల్లో ఉన్న సహాయం రెడ్ క్రాస్ కు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తలసీమియా బాధితుల కోసం రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ, పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, ఎండలో కష్టపడే కూలీలు, వ్యాపారాలు, పనుల నిమిత్తం బయటకు వచ్చే సందర్భంలో తాగునీటి కొరత ఎదుర్కొనకుండా ఉండేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం అని తెలిపారు.

అనంతరం అదనపు కలెక్టర్ యన్.రవి ని రెడ్ క్రాస్ సభ్యులు శాలువాతో సత్కరించి షీల్ అందచేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి.విజయ్ చందర్ రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈ. వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, బిళ్ళ రమణ రెడ్డి, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.