24 April, 2026 | 1:46 AM

బాధితులకు సెల్‌ఫోన్లు అప్పగించిన పోలీసులు

24-04-2026 12:00 AM

ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 23 (విజయక్రాంతి): మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేసిన ఘటనలో విచారణ జరిపి 25 మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకొని బాధితులకు ములుగు పోలీసులు అప్పగించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న భాధితులు ఆన్లైన్ (సీ ఐ ఈ ఆర్ పోర్టల్ ) ద్వారా ఫిర్యాదు చేయగా ఫిర్యాదు నమోదు చేసుకున్న స్టేషన్ సిబ్బంది, ములుగు ఐ టీ కోర్ టీం సహాయంతో ఈ నెలలో  మిస్త్స్రన 25 మొబైల్ ఫోన్లను విజయవంతంగా గుర్తించి, వాటిని గురువారం బాధితులకు ఎస్ పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని, ఐటీ కోర్ టీమ్ ను అభినందించారు. వారి కృషి వల్ల తక్కువ సమయంలోనే మొబైల్ ఫోన్లు తిరిగి సాధించగలిగామని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందికి మిస్సింగ్ మొబైల్స్ రికవరీపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజలు తమ వ్యక్తిగత వస్తువుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని, మొబైల్ ఫోన్లు కోల్పోయిన వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేసుకోని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.