24 April, 2026 | 1:46 AM

బాధ్యతగా విధులు నిర్వహించాలి

24-04-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 23(విజయక్రాంతి): విధి నిర్వహణలో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన ఐదుగురికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పత్రాలను ఎస్పీ  అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పోలీస్ కుటుంబాలను ఆదుకోవడమే కారుణ్య నియామకాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ. సూపరింటెండెంట్ ఖలిముద్దీన్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు మున్నం విజయ శంకర్ రెడ్డి , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.