ఎన్‌టీఆర్ సర్కిల్ వద్ద చలివేంద్రం ఏర్పాటు
ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసిన నిర్వాహకులు
ఖమ్మం, ఏప్రిల్ 6(విజయక్రాంతి): ఖమ్మంలో గత ఏడేళ్లుగా ఎ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రాల కార్యక్రమం ఈ సంవత్స రం కూడా కొనసాగుతోంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్ల సహకారంతో ఖమ్మంలోని ఎన్‌టీఆర్ సర్కిల్ వద్ద సోమవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పూనకొల్లు నీరజ, 55వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు సుధాకర్ శ్రావణి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు కొట్టేరు వెంకట్ రెడ్డి, నారాయణరావు, చైతన్య, కిషోర్, హరి (హరి స్వీట్స్ అధినేత), గోపాల్, మమత, మున్సిపల్ డీఈ ధరణి, మున్సిపల్ ఏఈ యాకూ బ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మేడం పూనకొల్లు నీరజ, కార్పొరేటర్ మో తారపు సుధాకర్ శ్రావణి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఖమ్మం వాలంటీర్లు చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భం గా ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. మజ్జిగ పంపిణీకి సాయి ప్రసన్న ఇండస్ట్రీస్, సక్సెస్ ఒకేషనల్ జూ.కాలేజ్ యాజమాన్యం వారు స్పాన్సర్‌గా వ్యవహరించారు.




