7 April, 2026 | 3:04 AM

గంగపుత్ర భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం

07-04-2026 12:41 AM

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 6(విజయక్రాంతి): ఉప్పల్ భగాయత్‌లో సంవత్సరాలుగా నిలిచిపోయిన గంగపుత్ర ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని ప్రభుత్వంతో చర్చించి పనులు ప్రారంభిస్తామని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. సోమవారం ఉప్పల్ భగాయత్‌లో ఆయన స్వయంగా నిర్మాణ స్థలాన్ని పరిశీలించి పనుల పురోగతిపై సమీక్షించి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గంగపుత్ర రాష్ట్ర వివిధ సంఘాల ముఖ్య నాయకులు గడప శ్రీహరి, చాట్ల సదానంద, మంగళపల్లి శంకర్, మెట్టు ధనరాజ్, గాలి సత్యనారాయణ, పూస నరసింహ, మలకు మహేం దర్, గిరిబాబు, బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.