calender_icon.png 30 December, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సర్పంచులకు ఘన సన్మానం

30-12-2025 04:45:11 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): మద్నూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాణి అధ్యక్షతన మంగళవారం నూతన సర్పంచులకు మండల అధికారులతో పరిచయ వేదిక నిర్వహించారు. శాఖల వారీగా అధికారులను సర్పంచులకు పరిచయం చేయించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు అందరికీ ఎంపీడీవో అధ్యక్షతన ఘన సన్మానాలు చేశారు. మద్నూర్ మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలకు గాను 19 మంది సర్పంచులు హాజరైనట్లు తెలిసింది.

సర్పంచులకు సన్మానంతో పాటు మద్నూర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేసే విట్టల్ అనే వ్యక్తి ఈ నెల 31న పదవి విరమణ పొందనున్న సందర్భంగా ఇదే కార్యక్రమంలో ఆ కార్మికునికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఎండి ముజీబ్, ఎంఈఓ రాములు నాయక్, మండల వ్యవసాయ అధికారి రాజు, పంచాయతీరాజ్ శాఖ ఏఈ అరుణ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ, అలాగే ఏపీఎం జగదీష్ కుమార్, ఏపీవో పద్మ, అంగన్వాడి సూపర్వైజర్ కవిత, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.