3 April, 2026 | 2:01 PM

Breaking News

మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •  

తాగునీటి సరఫరాకు అంతరాయం

03-07-2024 09:11 PM

హైదరాబాద్: జలమండలి పరిధిలోని పలు డివిజన్లలో గురువారం తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. నగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజులకు విద్యుత్ సరఫరా చేసే పెద్దాపూర్, కంది 132కేవీ సబ్‌స్టేషన్లలో ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతులు చేపడుతున్నందున నీటి సరఫరా నిలిచిపోతుందని జలమండలి అధికారులు బుధవారం వెల్లడించారు. గురువారం ఉదయం 7గంటల నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు మరమ్మతులు  జరుగుతున్నందున పలు చోట్ల పూర్తిగా అంతరాయం కలుగుతుందని, మరి కొన్ని చోట్లలో ప్రెజర్‌తో నీటి సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. 

పూర్తి అంతరాయం ఏర్పడే ప్రాంతాలు

ఓఅండ్‌ఎం డివిజన్ 3లోని షేక్‌పేట్, ఓ అండ్ ఎం డివిజన్ 6లోని జూబ్లీహిల్స్, సోమాజీగూడ, బోరబండ, ఓఅండ్‌ఎం డివిజన్ 9 మూసాపేట్, ఓఅండ్‌ఎం డివిజన్ 15 నల్లగండ్ల, చందానగర్, హుడా కాలనీ, హఫీజ్‌పేట్, ఓ అండ్ ఎం డివిజన్ 18 మణికొండ, నార్సింగి, మంచిరేవుల, ఓ అండ్ ఎం డివిజన్ 24లో తెల్లాపూర్, ఓ అండ్ ఆర్ డివిజన్ 8లోని బల్క్ కనెక్షన్లకు తీవ్ర అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఓ అండ్ ఎం డివిజన్ 3 భోజగుట్ట రిజర్వాయర్, ఓ అండ్ ఎం డివిజన్ 9లోని కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌లలో లోప్రెజర్‌తో అంతరాయం కలుగుతుందని చెప్పారు.