24 August, 2026 | 2:13 AM

దృశ్యం 4 కూడా..

24-08-2026 12:00 AM

సినీ అభిమానులను ఎంతగానో అలరించిన మైండ్‌బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం’ నుంచి నాలుగో భాగం రాబోతోంది. ‘దృశ్యం 4’ ప్రాజెక్టును మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల విడుదలైన ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ విజయం అందించిన ఉత్సాహంతో, కథను మరింత రసవత్తరంగా ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంచలన ప్రకటనతో భారతీయ చలనచిత్ర రంగంలో ‘దృశ్యం 4’పై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా ద్వారా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మరోసారి జార్జ్‌కుట్టి పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, టాలెంటెడ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

సరికొత్త రికార్డులకు సిద్ధమవుతున్న ఈ సినిమా భారతీయ చలనచిత్ర రంగంలో ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఫ్రాంచైజీ ’దృశ్యం’. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషలతోపాటు చైనీస్, కొరియన్ వంటి అంతర్జాతీయ భాషల్లోనూ రీమేక్ అయి సంచలన విజయం సాధించిన ఈ సిరీస్ నుంచి ఇప్పుడు నాలుగో భాగం సిద్ధమవుతోంది. ఇటీవలే జరిగిన ఒక అవార్డుల వేడుకలో ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించి సినిమా ప్రపంచంలో పెద్ద దుమారమే లేపారు.