15 June, 2026 | 6:31 PM

Breaking News

దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •   ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •  

సీసీసీలో 1,381 డ్రైవర్‌పోస్టుల భర్తీ

10-02-2026 12:55 AM

మాజీ సైనికులు, మాజీ అర్థసైనిక సిబ్బంది నుంచి దరఖాస్తుల ఆహ్వానం

నేటి నుంచి 15 వరకు స్వీకరణ

58 ఏళ్ల లోపు వారికే అవకాశం

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ డ్రైవర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,381 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పదవీ విరమణ చేసిన మాజీ సైనికులు, మాజీ పారమిలటరీ సైనిక దళాల సిబ్బంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయస్సు.. 28--02--2026 నాటికి అభ్యర్థి వయస్సు 58 ఏళ్ల లోపు ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నివాస ధ్రువీకరణ పత్రాలుగా సమర్పించాలి. గత రెండు సంవత్సరాలలోపు సర్వీసు నుంచి పదవీ విరమణ చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల గౌరవ వేతనం చెల్లిస్తారు. ఇందులో ఎటువంటి సెలవులు ఉండవు. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

ఆసక్తి గల అభ్యర్థులు సోమాజిగూడలోని సైనిక్ వెల్ఫేర్ కార్యాలయం నుంచి అప్లికేషన్ ఫారమ్ సాఫ్ట్ కాపీని పొందవచ్చు. నింపిన దరఖాస్తులను అవసరమైన జిరాక్స్ పత్రాలతో జతచేసి వ్యక్తిగతంగా హాజరై అందజేయాలి. వివరాల కోసం ఎ గోపాల్‌రెడ్డి, ఆర్‌ఐని 8712674111 నంబర్‌లో సంప్రదించవచ్చు. దరఖాస్తుల సమర్పణకు ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే.