calender_icon.png 10 February, 2026 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ మద్యం పట్టివేత

10-02-2026 12:54:56 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 9(విజయక్రాంతి):పట్టణంలోని రాజంపేటలోని శ్రీ లక్ష్మీ హోటల్లో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న గోగికార్ రంజిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే మద్యం నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ నేతృత్వంలో దాడి చేసి, వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మద్యం విలువ రూ.87,720/గా అంచనా వేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.