calender_icon.png 5 October, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్రెయిన్‌పై డ్రోన్లతో బాంబ్ దాడులు

05-10-2025 12:47:06 AM

  1. రైల్వేస్టేషన్‌ను టార్గెట్ చేసిన రష్యన్ సైన్యం
  2. రైలు బోగీలు దగ్ధం.. 30 మందికి పైగా గాయాలు
  3. దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపాటు
  4. రష్యన్ ఉన్మాదంపై ప్రపంచం నిర్లక్ష్య ధోరణి వహించొద్దని అభ్యర్థన

కీవ్, అక్టోబర్ 4: ఉక్రెయిన్‌ేొ-రష్యా దేశాల మ ధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడంలేదు. రష్యన్ సైన్యాలు శనివారం ఉక్రెయిన్‌లోని సుమీ రైల్వేస్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో బాంబ్ దాడులు చేశాయి. దాడుల్లో కొన్ని బోగీ లు కొన్ని దగ్ధమై 30 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు క్షతగాత్రులయ్యారు. ప్రమాద తీవ్రత, ప్రాణ నష్టంపై స్పష్టత రానప్పటికీ, ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నట్లు తెలిసింది.

దాడులకు సం బంధించిన దృశ్యాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దాడులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘సుమీ ప్రాం తంలోని రైల్వే స్టేషన్‌పై రష్యన్ సైన్యం డ్రోన్ దాడులు జరిపింది. దాడుల్లో అనేక మంది గాయపడ్డారు. సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేయడం దారుణం. ర ష్యా ఉన్మాద ప్రవర్తన పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోర ణి వహించకూడదు. 

యుద్ధం ముగింపుపై ఐరోపాదేశాలతో పాటు అమెరికా నుంచి ఎన్నో ప్రకటనలు వింటున్నాం. కానీ, మాకు కేవలం మాటల సాయం సరిపోదు. బలమైన సహకారం అవసరం’ అని పేర్కొన్నారు.