23-02-2026 01:34:55 AM
24న సెక్రటేరియట్ ముట్టడికి సిద్ధం
ఉద్యోగుల విలీనం.. ప్రధాన డిమాండ్లీ ఎజెండా
హామీల అమలు కోసం ఏకమైన జేఏసీ
నిర్మల్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి) : ప్రయాణికుల సేవ.. ప్రథమ కర్తవ్యం అని గొప్పలు చెప్పుకుంటున్న టీజీ ఆర్టీసీలో కార్మికులు ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్ తో పాటు ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం టీజీ ఆర్టిసి ఉద్యోగ సంఘాలు ఒకటిగా పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం అధికారుల కు వచ్చి 25 నెలలు దాటిపోయిన ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల డిమాండ్లపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో వాటి సాధనకు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈనెల 24న తెలంగాణ రాష్ట్రం లోని టీజీ ఆర్టీసీ పరిధిలో ఎన్‌ఎంయు టీఎంయూ ఎస్ డబ్ల్యూ ఇతర కార్మిక సంఘాలతో జేఏసీగా ఏర్పడి ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.
ప్రస్తుత ప్రభుత్వం టీజీ ఆర్టీసీ సంరక్షణ ఉద్యోగ భద్రత ఇతర ప్రధాన డిమాండ్లు సాధన కోసం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు చలో సెక్రటేరియట్ పిలుపు ఇవ్వడంతో ఆర్టీసీలో చర్చ జరుగుతోంది టీజీ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి ఆరోగ్య సమస్యలు గుండె జబ్బులు తో మరణిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక కార్యచరణ
అదిలాబాద్ టీజీ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఈనెల 24న నిర్వహించి చలో సెక్రటే రియట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆర్టీసీ కార్మికులు కార్యచ రణ రూపొందిస్తున్నారు. అదిలాబాద్ రీజియన్ పరిధిలో అదిలాబాద్ ఉట్నూర్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ బైంసా టీజీ ఆర్టీసీ డిపోలు ఉండగా 2110 కార్మికుల ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 613 టీజీ ఆర్టీసీ బస్సులను తిప్పుతూ రెండున్నర లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీలు మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించి మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులకు పనిభారం పెరిగిన వారి డిమాండ్లు మాత్రం పరిష్కారం కావడం లేదు.
వీరిలో డ్రైవర్లు కండక్టర్లు మెకానికులు హెల్పర్లు క్లీనర్లు ఆఫీస్ ఉద్యోగులు ఉన్నారు. 2014లో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీ నం చేసి ఉద్యోగ బెనిఫిట్స్ భద్రతను ఆర్టీసీ పరిరక్షణ బడ్జెట్ తదితర అంశాలపై హామీ ఇచ్చిన అధికారులను అమలు కాలేదు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో 42 రోజుల పాటు సమ్మె కూడా చేశారు. ప్రభుత్వం సమ్మె విరబింబిన అనంతరం ఆర్టీసీ విలీనంపై స్ప ష్టమైన ప్రకటన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపిన అది అమలు కాకుండానే ప్రభుత్వం దిగిపోయింది.
దీంతో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల సాధన ప్రభుత్వంలో విలీనం బడ్జెట్ తదితర అంశాలపై స్పష్టమైన ప్రకటన హామీ ఇచ్చిన ఇంతవరకు అమలు కాకపోవడంతో దాన్ని సాధించుకునేందుకు రెండేళ్ల తర్వాత టీజీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఐక్యంగా చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం చర్చనీయా అంశంగా మారింది
ప్రధాన డిమాండ్లు
రాష్ట్రంలో టీజీ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలన్ చేసే విలీనం బిల్లును గవర్మెంట్ ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు.
డిమాండ్ల సదనకు వేరువేరుగా ఆందోళన చేపట్టిన కార్మిక సంఘాలు ఏడు సంఘాలతో జేఏసీగా ఏర్పడింది.
2021లో ప్రకటించిన వేతన సవరణ ఉద్యోగులకు 30% బెనిఫిట్ వెంటనే అమలు చేయాలి
టీజీ ఆర్టీసీకి 2500 కోట్ల బకాయిలు చెల్లించాలి.
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం బడ్జెట్ను ప్రతినెల 350 కోట్లు విడుదల చేయాలి.
టీజీ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
కారుణ్య నియామకాలు చేపట్టి వారికి ఉద్యోగ భద్రత ప్రభుత్వ బెనిఫిట్ ఇవ్వాలి.
ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ లపై విధించిన ఆంక్షలు ఎత్తివేసి డిమాండ్ల పరిష్కారానికి చర్చలు జరపాలి.
ఆర్టీసీ ఉద్యోగులపై ప్రస్తుతం 12 గంటల నుంచి 16 గంటల వరకు పని భారం పెంచినందున తగ్గించాలి.
ఎలక్ట్రికల్ బస్సులను టీజీ ఆర్టీసీ మాత్రమే కొనుగోలు చేయాలి.
మహాలక్ష్మి పథకంతో రద్దీ పెరిగినందున పల్లె వెలుగు ఇతర సర్వీసులను పెంచాలి.
టీజీ ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదవీ విరమణ రోజే అందించాలి.
మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలి.
ఆర్టీసీ కార్మికులకు వైద్య ఖర్చులు ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు హెల్త్ కార్డులు అందించాలి
టీజీ ఆర్టీసీలో ప్రతి సంవత్సరం ఖాళీలు భర్తీ చేయాలి.
ఆర్టీసీ ఉద్యోగులకు రుణాలు అందించాలి.
ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ ప్రైవేటీకరణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
పైన పేర్కొన్న డిమాండ్ల సాధన కోసం టీజీ ఆర్టిసి జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 24 చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో టీజీ ఆర్టీసీ ఉద్యోగుల కార్మికుల కార్యచరణ ఆ సంస్థ పై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి
ప్రభుత్వంలో విలీనమే ప్రధాన ఎజెండా
టీజీ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రభుత్వంలో విలీనం చేస్తామని బిల్లు తీసుకొచ్చిన అప్పటి ప్రభుత్వం గవర్నర్ ఆ బిల్లు పెండింగ్ ఉన్నందున ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే ఆమోదించి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలి. ప్రభుత్వంపై రెండు సంవత్సరాలుగా ఆశతో ఎదురు చూసినం అయినా ఫలితం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకు శ్రీకర చుట్టాం.
రెడ్డి, టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు
పేరుకే ఉద్యోగం అన్ని సమస్యలే
టీజీ ఆర్టీసీలో సంస్థ పరిరక్షణ ఆదాయ వనరులను పెంచేందుకు టీజీ ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు కష్టపడి పనిచేస్తున్న తగిన ప్రతిఫలం అందడం లేదు. ఏళ్ల తరబడి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా జాప్యం చేస్తోంది. ఉద్యోగాలు భర్తీ చేసి భద్రత కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించి పని భారాన్ని తగ్గించాలి. చలో సెక్రటేరియట్ ముట్టడికి 200 మందిని తీసుకెళ్తున్నాం
గంగాధర్ రీజియన్ కార్యదర్శి