23-02-2026 01:36:06 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచనలను తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని, వాటికి జీవం పోస్తున్నారని ఆయన ప్రశంసించారు. తెలంగాణలో చైర్మన్, మేయర్, వైఎస్ చైర్మన్, డిప్యూటీ మేయర్‌తో పాటు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులను మహిళలకి రిజర్వేషన్ కల్పించామని వెల్లడించారు.
ఇందిరా గాంధీ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ అని, పంచాయతీరాజ్ ఎన్నికల్లో మహిళలకు అవకాశం ఇచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆలోచనలను రేవంత్‌రెడ్డి ముందుకు తీసుకొని పోతున్నారని చెప్పారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. డీసీసీల ట్రేడింగ్‌లో పనిచేసే వాళ్లకి పదవు లు అని సీఎం చెప్పడం అభినందనీయమన్నారు.
రాష్ర్టంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తాము శక్తిమేర అన్ని విధా లా కృషి చేశామని, కులగణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత న్యాయం జరుగుతుందని వీహెచ్ ఆశాభావం వ్య క్తం చేశారు. ఇక ఇటీవల ఏఐ సమ్మిట్‌లో రాహుల్‌గాంధీకి జరిగిన అవమానంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధం గా వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. సామాజిక న్యాయం, రా జ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యమని వీహెచ్ స్పష్టం చేశారు.