12 June, 2026 | 1:23 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •  

ఇక వాట్సాప్‌లో విద్యుత్ సేవలు

23-02-2026 01:34 AM
  1. టీజీఎస్పీడీసీఎల్ నయా చాట్‌బాట్ ప్రారంభం

ఫోన్ 8712441912కు హాయ్ పంపండి: సీఎండీ ముషారఫ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తన వినియోగదారుల కోసం అత్యాధునిక సాంకేతిక సేవలను అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్ సంబంధిత సమస్యలు, బిల్లింగ్ వివరాలు ఇతర సేవల కోసం వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారానే సమాచారం పొందేలా వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించింది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదివారం ఈ సరికొత్త సదుపాయాన్ని వెల్లడించారు.

విద్యుత్ వినియోగదారులు 8712441912 నంబర్‌ను తమ ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నంబర్ వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా చాట్‌బాట్ యాక్టివేట్ అవుతుంది.

దీని ద్వారా విద్యుత్ అంతరాయాలపై ఫిర్యాదుల నమోదు, నెలవారీ కరెంటు బిల్లుల వివరాలు, బిల్లు చెల్లింపుల స్థితిగతులు విద్యుత్ సరఫరాకు సంబంధించిన తాజా సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు. ఈ డిజిటల్ విధానం వల్ల వినియోగదారులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, సేవల్లో మరింత పారదర్శకత పెరుగుతుందని సీఎండీ పేర్కొన్నా రు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరిం త వేగవంతం చేసేందుకు ఈ చాట్‌బాట్ దోహదపడుతుందని పేర్కొన్నారు.