21న ‘శపథ్’తో డ్రగ్ ఫ్రీ-యంగ్ ఇండియా ఉద్యమం
అగర్వాల్ సమాజ్ తెలంగాణ
ముషీరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే లక్ష్యంతో అగర్వాల్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో ’శపథ్-అవర్ మిషన్, అవర్ రెస్పాన్సిబిలిటీ’ పేరిట ’డ్రగ్ ఫ్రీ-యంగ్ ఇండియా’ సామాజిక ఉద్యమాన్ని జూన్ 21న నౌబత్ పహాడ్లోని భాస్కర ఆడిటోరియంలో ప్రారంభించనున్నట్లు శపథ్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు రామ్ నివాస్ బన్సల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవేంద్ర శాస్త్రి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో శపథ్ గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. విద్యా సంస్థలు, పట్టణ కూడళ్లలో ర్యాలీలు, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, బీసీ సంక్షేమ సలహాదారు వి.హనుమంత్ రావు, మాజీ ఎంపీ గిరీష్ కుమార్ సంఘీ, ఎమ్మెల్యే టి.శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలా గౌరవ అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య కీలకోపన్యాసం చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సునీల్ అగర్వాల్, రాజీవ్ అగర్వాల్, విశాల్ కేడియా, అనిల్ సింగ్, అనిరుధ్ గుప్తా, నరేంద్ర గోయల్ తదితరులు పాల్గొన్నారు.






