మత్తు పదార్థాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
ఇల్లందు టౌన్: (విజయక్రాంతి): మత్తు పదార్థాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఇల్లందు డిఎస్పి చంద్ర భాను(DSP Chandrababu) అన్నారు. సోమవారం ఆయన ఇల్లందు మండలం 21 పిట్ ఏరియాలో శాంతి భద్రతల పరిరక్షణకై కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ద్విచక్ర వాహనాల దారులు తప్పనిసరిగా పెద్దమండ ధరించాలని సూచించారు. ఎవరైనా భూకబ్జాలు చేయడం, భూ సంబంధిత గొడవల్లో పాల్గొని అమాయకులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపించేవారు ఉంటే 100 సమాచారం అందించాలన్నారు. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని కోరారు. గంజాయి రవాణా, విక్రయం లేదా సేవించిన కఠిన చర్యలుతీసుకుంటా మన్నారు. ఈకార్యక్రమంలో సిఐ లు రవి, సురేష్, ఎస్సైలు సూర్య, హసీనా, నాగుల్ మీరా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






