21-07-2025 12:24:39 PM
డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు...
ఆదిలాబాద్,(విజయక్రాంతి): జీవో నెంబర్ 49 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి సంఘాలు చేపట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad district) బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదివాసీల బంద్ కు వివిధ రాజకీయ పార్టీలతో పాటు ఆయా ప్రజా సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. సోమవారం ఉదయం నుండి తుడుం దెబ్బతో పాటు ఆదివాసీల్లోని 9 తెగల ఆయా సంఘాల నాయకులు జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్, ఏజెన్సీ ప్రాంతాల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ తెరిచి ఉన్న దుకాణాలను మూసి వేయించారు. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.