మత్తు పదార్థాలు సమాజానికి పట్టిన చీడపురుగు
మహేశ్వరం, జూన్ 27: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఫ్యాబ్ సిటీ ఆవరణలో జిల్లా పోలీస్, ఎక్సైజ్, మహిళా శిశు సంక్షేమ, మెడికల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వాక్‌థాన్ నిర్వహించారు. కలెక్టర్ శశాంక, రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి వాక్‌థాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిం చారు. యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిదని అన్నారు. మాదక ద్రవ్యాలపై జరుగు తున్న పోరాటంలో యువత భాగస్వాములు కావాలని కోరారు.
అనంతరం సీపీ తరుష్ జోషి మాట్లాడుతూ.. మత్తు బారినపడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. డ్రగ్స్ లేదా ఇతర మాదక ద్రవ్యాలు ఎవరైనా అమ్మినా లేదా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమం లో మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, కందుకూర్ ఆర్డీవో సూర జ్ కుమార్, మహిళా శిశు సంక్షే మ శాఖ అధికారి పద్మజా రమణ, డీసీపీ క్రైమ్ అరవింద్‌బాబు, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, ఏసీపీ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




