2 July, 2026 | 2:50 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

28-06-2024 05:17 AM

రంగారెడ్డి, జూన్ 27 (విజయక్రాంతి): సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా బ్యాంకు అధికారులు తమ లక్ష్యాలను చేరుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో బ్యాంకర్లతో కలిసి డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా  వార్షిక రుణ ప్రణాళికలను కలెక్టర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా క్రెడిట్ ప్లాన్‌ని 2024 ఏడాదికి సంబంధించి రూ.49815.36 కోట్లతో, గతేడాది కంటే రూ.25648.36 కోట్ల పెరుగుదలతో, 28.17 శాతం వృద్ధిని అంచనా వేయడం జరిగిందని చెప్పారు.

బ్యాంకు సేవలను అందించాలనే ఉద్దేశంతో మారుమూల ప్రాంతాలకు బీసీ పాయింట్లను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రతి అకౌంటుకు ఆధార్‌కార్డు, పాన్‌కార్డ్ సీడ్ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లాలో అర్హులందరికీ బ్యాంకులు ఏపీవై, ఎస్‌ఎస్‌వై ఖాతాలను తెరవాలని ఆదేశించారు. జిల్లాలో ఆర్థిక సహాయ పథకాలను గ్రౌండింగ్ చేసి లక్ష్యాలను సాధించినందుకు బ్యాంకర్లు, సెక్టోరియల్ హెడ్‌లు, డీఆర్‌డీఏ, డీఐసీ, సెర్ప్, మెప్మా అధికారులను అభినందించారు.