29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం

11-03-2026 01:14 AM

ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపట్ల కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్‌ఐ రమేష్ తో కలిసి పోలీసులు స్వాధీనం చేసుకున్న భారీ గంజా యి మొక్కలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... ఆదిలాబా ద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. 

ఇచ్చోడ మండలంలో తనిఖీలు చేయగా నలుగురి నిందితులను అరెస్టు చేసి వారి నుండి 420 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ దాదాపు  రూ. 42 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇచ్చోడ మండలం హీరాపూర్ గ్రామంలో ప్రధాన నిందితుడు పవార్ మాధవ్ అనే వ్యక్తి తన 9 ఎకరాల వ్యవసాయ భూమిలో శనగ పంట సాగు మాటున గంజాయి పండిస్తున్నాడని తెలిపారు. తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం ఇచ్చోడ ఎస్.ఐ రమేష్ ఆధ్వర్యంలోని దాడి చేయడం జరిగిందన్నారు. 

ప్రధాన నిందితుడు పవార్ మాధవ్‌తో పాటు ఆత్రం దత్తాత్రి, షేక్ ముజాయిద్, షేక్ ఆరిఫ్ ల ను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 420 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు తమ పంట పొలాలలో గంజాయి సాగు చేస్తున్న 40 మంది కి రైతు భరోసా, ప్రభుత్వ పథకాలు వర్తించకుండా ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగిందని తెలిపారు. యువత ప్రజలు గంజాయి బారిన పడకూడదని గంజాయికి దూరంగా ఉండాలని మాదకద్రవ్యాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు.

పట్టుబడ్డ నలుగురికి గంజాయి సేవించే అలవాటు ఉన్నందున వారు గంజాయిని పం డిస్తూ, అధిక లాభాలు పొందాలనే దురుద్దేశంతో జాతీయ రహదారిపై వెళ్ళే లారీ డ్రైవర్ ల వీటిని విక్రయిస్తున్నారని తెలిపారు. జల్సా లకు అలవాటు పడి, గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నారన్నారు. అరెస్టు చేసిన  నిదితులను రిమాండ్‌కు తరలించడం జరుగుతుం దని ఎస్పీ వెల్లడించారు.