calender_icon.png 18 September, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్‌ జిల్లాలో 4 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం

18-09-2025 01:01:20 PM

హైదరాబాద్: మెదక్ జిల్లా(Medak district) మాసాయిపేట మండలం రామంతపూర్ లో భారీగా డ్రగ్స్(Drugs seized ) పట్టుబడింది. గురువారం ఉదయం నార్కోటిక్ డ్రగ్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రామంతపూర్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా హహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తున్న వాహనంలో 4 కిలోల డ్రగ్స్ ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రగ్స్ తరలిస్తున్న యూపీకి చెందిన సావెల్ పాండే, నీలేష్ పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.