calender_icon.png 18 September, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి భువనగిరిలో ఇద్దరు చిన్నారులు అదృశ్యం

18-09-2025 01:31:56 PM

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి( Yadadri Bhuvanagiri) జిల్లాలో గురువారం నాడు ఇద్దరు చిన్నారులు అదృశ్యం(Children Missing) అయ్యారు. మూడేళ్ల బాలుడు, మూడేళ్ల బాలిక కనిపించకుండా పోయారు. అదృశ్యమైన వారిని బిహార్ కు చెందిన ఇద్దరు కూలీల పిల్లలుగా గుర్తించారు. తుర్కపల్లి మండలం రుస్తాపురంలో బస్వాపూర్ ప్రాజెక్టు పనుల కోసం కూలీలు వచ్చారు. పిల్లలు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందని తల్లిదండ్రులు తుర్కపల్లి పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదృశ్యమైన పిల్లల కోసం గాలిస్తున్నామని తెలిపారు.