18-09-2025 12:50:20 PM
బెజ్జూర్(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు శ్రావణ్, డాక్టర్ మన్విత నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన వైద్య అధికారి అవినాష్ ప్రమోషన్ పై జిల్లా వైద్యశాలకు వెళ్లారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వైద్యులు మారుమూల ప్రాంతంలో వైద్య సేవలు అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు.