calender_icon.png 18 September, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంటనే ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం

18-09-2025 01:23:50 PM

జిల్లా మత్స్యశాఖ  డైరెక్టర్ పోతరవేని క్రాంతి 

మంథని,(విజయక్రాంతి): వెంటనే ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు( Minister Sridhar Babu) కు గురువారం హైదరాబాద్ లో తన నివాసంలో వినతి పత్రం అందజేశామని జిల్లా మత్స్యశాఖ  డైరెక్టర్ పోతరవేని క్రాంతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ  ఆలస్యం అవుతున్నందున మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని, త్వరగా చేప పిల్లల పంపిణీ జరిగేలా చూడాలని, లేనిపక్షంలో నగదు బదిలీ చేపించాలని, అలాగే మత్స్యకారులకు నూతన పథకాలు పెట్టి ఆర్ధికంగా ప్రోత్సహించాలని శ్రీధర్ బాబు కు వినతి పత్రంలో అందజేశామని ఆయన పేర్కొన్నారు. వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే మత్స్యకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు కు క్రాంతి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.