14 July, 2026 | 4:11 PM

చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి

14-07-2026 03:26 PM

* మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మెడిశెట్టి ఉమా శ్రీధర్ 

చేర్యాల (విజయక్రాంతి): ప్రతి శనివారం చేర్యాల పట్టణంలో మంగళవారం శుక్రవారం డ్రైడే పాటించి వ్యాధులకు దూరమవ్వాలని చేర్యాల మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్ సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో దోమల పెరుగుదలను అరికట్టేందుకు ఇంటి చుట్టూ నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి శుభ్రం చేయడం, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూల కుండీలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వర్షపు నీటిని వృథా కాకుండా రైన్‌వాటర్ హార్వెస్టింగ్ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.