08-12-2025 07:02:52 PM
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్..
శివంపేట్ (విజయక్రాంతి): శివంపేట మండలంలోని వివిధ గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్స్ ను సందర్శించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా జరిగేలా ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. తూప్రాన్ డీఎస్పీ నరేందర్, తూప్రాన్ సీఐ రంగా కృష్ణ, శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వాట్సాప్ లో గాని, ఇతర సోషల్ మీడియాలో గాని ఎవరిని ఉద్దేశించి అనుచిత వ్యాక్యాలు చేయరాదు.. రెచ్చగొట్టే మెసేజ్ లు పంపరాదు.. అన్ని వాట్సాప్ గ్రూప్ లు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు పోలీస్ వారి పర్యవేక్షణలో ఉంటాయి. ఓటర్స్ అందరూ తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ కార్యక్రమంలో శివంపేట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చల్ల మధుకర్ రెడ్డి, పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు.