08-12-2025 07:05:34 PM
* శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు..
* మెదక్ డీఎస్పి ప్రసన్నకుమార్..
పాపన్నపేట (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో మెదక్ డీఎస్పి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో ధైర్యం, భరోసా కల్పించడానికి పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ప్రజలను బెదిరింపులపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మెదక్ రూరల్ సీఐ జార్జ్, స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది ఉన్నారు.